Telugudesam: టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు ఓబుల్ రెడ్డికి చంద్రబాబు ఆత్మీయ పరామర్శ

  • అనారోగ్యంతో బాధపడుతున్న ఓబుల్ రెడ్డి
  • నెల్లూరు జిల్లా నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశం
  • హాజరైన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ నెల్లూరు జిల్లా నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ రాజకీయవేత్త బెజవాడ ఓబుల్ రెడ్డిని పరామర్శించారు. ఓబుల్ రెడ్డి గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పక్కనే కూర్చుని ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. కాగా, నెల్లూరు జిల్లా నియోజకవర్గాల సమావేశాల్లో భాగంగా నేతలతోనే కాకుండా కార్యకర్తలతోనూ, అభిమానులతోనూ మాట్లాడారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకున్నారు. వారు చెప్పేది ఓపిగ్గా విన్నారు.
Telugudesam
Chandrababu
Obul Reddy
Nellore District

More Telugu News