Telangana: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై చంద్రబాబు వ్యాఖ్యలు

  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె
  • ఓ డ్రైవర్, మరో కండక్టర్ బలవన్మరణం
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
తెలంగాణలో ఓ ఆర్టీసీ డ్రైవర్, మరో కండక్టర్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్ ఒంటికి నిప్పంటించుకుని మృతి చెందగా, సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఉరేసుకుని ప్రాణత్యాగం చేశాడు.  దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఏదైనా బతికి సాధించుకోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. జీవితం ఎంతో విలువైనది కాబట్టి కార్మికులందరూ తమ కుటుంబాల గురించి ఆలోచించి, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Telangana
Chandrababu
TSRTC
Telugudesam

More Telugu News