Nayanatara: మరింత అందంగా కనిపించే ప్రయత్నాల్లో నయనతార

  • తెలుగు .. తమిళ భాషల్లో నయన్ కి క్రేజ్ 
  •  నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు ఎక్కువ
  • ప్రత్యేక చికిత్స కోసం కేరళకు
తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆరంభంలో కాస్త బొద్దుగానే కనిపిస్తూ గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార, ఆ తరువాత నాజూకుగా కనిపించడం కోసం బాగా సన్నబడింది. అయితే నయనతార సన్నబడటం వలన, ఆమె మునుపటిలా అందంగా కనిపించడం లేదనే అసంతృప్తిని చాలామంది అభిమానులు వ్యక్తం చేశారు.

నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎక్కువగా చేస్తూ రావడం వలన, ఆ తరహా సినిమాల్లో నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వలన గ్లామర్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల మళ్లీ కాస్త గ్లామర్ ప్రధానమైన పాత్రలు చేయవలసి వచ్చినప్పుడు, తనలో కాస్త గ్లామర్ తగ్గిందనే ఆలోచన నయనతారకి వచ్చిందట. దాంతో ప్రత్యేకమైన ప్రకృతి వైద్యం కోసం ఆమె తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు. కేరళలో ప్రత్యేక చికిత్స అనంతరమే ఆమె షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు.
Nayanatara

More Telugu News