Chiranjeevi: సైరా సినిమాను చూసేందుకు జగన్ ను ఆహ్వానించిన చిరంజీవి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి చిరంజీవి దంపతులు వెళ్లారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన జగన్ కు శాలువా కప్పి చిరంజీవి సత్కరించారు. ఈ సందర్భంగా జగన్, చిరంజీవి దాదాపు గంటసేపు మాట్లాడుకున్నారు. తన తాజా చిత్రం 'సైరా'ను చూడాలని ఈ సందర్భంగా జగన్ ను చిరంజీవి ఆహ్వానించారు. సినిమా చాలా బాగుందని అందరూ చెబుతున్నారని చిరంజీవికి జగన్ అభినందనలు తెలిపారు. చిరంజీవితో చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా జగన్ చెప్పారు.