Chandrababu: చంద్రబాబునే బెదిరించాను... నన్ను తెలంగాణ ద్రోహి అనడం తగదు: ఎర్రబెల్లి

  • కార్మికులను ఎప్పుడూ ఏమీ అనలేదన్న ఎర్రబెల్లి
  • కార్మికులు తమ వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని డిమాండ్
  • తెలంగాణ కోసం జైలుకు కూడా వెళ్లానని వెల్లడి
తనపై కార్మిక సంఘాలు చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. అప్పట్లో చంద్రబాబు అంతటివాడ్నే బెదిరించి ప్రత్యేక తెలంగాణ కోసం లేఖ అడిగానని, అలాంటి తనను తెలంగాణ ద్రోహి అనడం తగదని ఎర్రబెల్లి ఆవేశంగా అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్లిన చరిత్ర తనదని ఆయన చెప్పుకొచ్చారు. కార్మిక సంఘాలను తాను పల్లెత్తు మాట కూడా అనలేదని, ఆర్టీసీ కార్మికులు విపక్షాల ఉచ్చులో చిక్కుకున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షమేనని స్పష్టం చేశారు.
Chandrababu
Errabelli
Telangana
TSRTC
TRS

More Telugu News