Chandrababu: ఆ పదాన్ని లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన ఘనత చంద్రబాబుదే: ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు

  • ‘యూ-టర్న్’ను లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టారు
  • ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు చంద్రబాబు
  • ‘రైతు భరోసా’తో చంద్రబాబుకు నోరు పెగలడం లేదు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘యూ-టర్న్’ అనే పదం వాడుకలోకి వచ్చిన తర్వాత ఆ పదాన్ని ఇప్పటిదాకా లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని సెటైర్లు విసిరారు. అవకాశవాదం, కాళ్లుపట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు బాబే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కోసం ఏపీ సీఎం జగన్ రూ.5510 కోట్లు విడుదల చేశారని, 50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ.12,500 చొప్పున సాయం అందుతుందని అన్నారు. చంద్రబాబుకు నోరు పెగలడం లేదని, రైతులను ఈ విధంగా ఆదుకోవచ్చని బాబు కలలో కూడా ఊహించి ఉండరని అన్నారు.
Chandrababu
Telugudesam
YSRCP
vijayasai reddy

More Telugu News