raithu bharosa: రైతుల విషయంలో ప్రభుత్వం రాజకీయాలు తగదు: టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల

  • మాటమార్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • రూ.50 వేలు ఒకేసారి ఇస్తానన్నారు
  • ఇప్పుడు విడతల వారీగా అంటున్నారు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలోనూ రాజకీయాలు చేస్తోందని, రైతు భరోసా విషయంలో చెప్పింది ఒకటి, అమలు చేస్తున్నది మరొకటని టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విమర్శించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తన మాట తప్పారన్నారు. ఎన్నికల సమయంలో ఒకేసారి రైతులకు రూ.50 వేలు ఇస్తానని చెప్పి, ఇప్పుడు విడతలవారీగా అంటున్నారని ఆరోపించారు. పైగా నిబంధనల పేరుతో పలు కొర్రీలు వేస్తున్నారని, 10 శాతం కౌలుదారుల వివరాలు కూడా ప్రభుత్వం వద్ద లేవన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులందరికీ అండగా నిలిస్తే వైసీపీ ప్రభుత్వం కొందరికే మేలు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
raithu bharosa
MLC chikkaala
jagan

More Telugu News