RTC Bus: కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ ను చితక్కొట్టిన స్థానికులు

  • వై-జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొన్న మరో ఆర్టీసీ బస్సు
  • ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్
హైదరాబాద్ కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక వై-జంక్షన్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, ఈ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడిపాడు. అతని నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం  చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ సంఖ్యలో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు, స్థానికులు గుమికూడారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని భావించి... అతడిని చితక్కొట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
RTC Bus
Accident
Kukatpalli

More Telugu News