మీకు దమ్ముంటే ఆగస్టు 5 నాటి మా నిర్ణయాన్ని మారుస్తామని ప్రకటించండి: మోదీ సవాల్
- జమ్మూకశ్మీర్ మన దేశానికి కిరీటం వంటిది
- ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని దమ్ముంటే ప్రకటించండి
- పాకిస్థాన్ మాదిరే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి
ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ మాట్లాడుతున్నట్టుగానే ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయని మోదీ దుయ్యబట్టారు. ఎన్సీపీ చేస్తున్న వ్యాఖ్యలు యావత్ దేశ ఆలోచనలకు విభిన్నంగా ఉన్నాయని అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఫడ్నవిస్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.