Chiranjeevi: 'యంగ్ చిరంజీవి'గా రామ్ చరణ్?

  • చిరంజీవి 152వ చిత్రం ప్రారంభం
  • సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో రామ్ చరణ్
  • ఇంకా అధికారికంగా వెలువడని ప్రకటన
చిరంజీవి పాత్రలో నటించనున్న రామ్ చరణ్ ... ఈ వార్త నిజమైతే అది మెగా ఫ్యాన్స్ కు పండగే. 'సైరా' తరువాతి సినిమాను చిరంజీవి ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర విభిన్న కోణాల్లో ఉంటుందని, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్ కనిపిస్తాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర', 'బ్రూస్ లీ' చిత్రాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్ చేయగా, 'ఖైదీ నంబర్ 150'లో రామ్ చరణ్ ఓ పాటలో స్టెప్పేశాడు. ఈ తాజా చిత్రంలో చిరంజీవి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
Chiranjeevi
Ramcharan
Movie
Tollywood

More Telugu News