TSRTC: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

  • ప్రాణత్యాగానికి పాల్పడిన ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్
  • ఎంతో బాధపడ్డానని ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్
  • ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని సర్కారుకు విజ్ఞప్తి
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చడం, ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం సంక్షోభాన్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి ప్రాణత్యాగం తనను ఎంతో బాధించిందని ట్వీట్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులను ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లోకి నెట్టకుండా ఉండాల్సిందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పవన్ హితవు పలికారు. ఇకనైనా ఈ సంక్షోభానికి ప్రభుత్వం ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.
TSRTC
Telangana
Pawan Kalyan
Jana Sena
TRS

More Telugu News