Ayodhya: సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ రేపు పునఃప్రారంభం

  • ఏడు దశాబ్దాలుగా అయోధ్య వివాదం
  • ఓ కొలిక్కి తీసుకురావాలని సుప్రీం ప్రయత్నం
  • వారం రోజుల దసరా విరామం తర్వాత షురూ కానున్న విచారణ
దాదాపు ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే ఘడియలు మరెంతో దూరంలో లేవు! కొన్నాళ్లుగా అయోధ్య కేసు సుప్రీంకోర్టులో శరవేగంతో విచారణ జరుగుతోంది. అక్టోబరు 17 లోపు ఇరువర్గాలు వాదనలు వినిపించడం పూర్తిచేయాలని సుప్రీం ఇప్పటికే తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో కోర్టుకు దసరా సెలవులు రావడంతో విచారణకు విరామం వచ్చింది. ఇప్పుడు వారం రోజుల దసరా విరామం అనంతరం మరోసారి కేసు విచారణ షురూ కానుంది. రేపటినుంచి సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ జరగనుంది.
Ayodhya
Supreme Court

More Telugu News