Telangana: టీఎస్సార్టీసీ సమ్మె ఉద్ధృతం.. మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం!

  • నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఘటన
  • పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోబోయిన డ్రైవర్ రవి  
  • అడ్డుపడ్డ తోటి కార్మికులు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి నిన్న ఆత్మాహుతికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే వరంగల్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని డ్రైవర్ రవి నిప్పంటించుకోబోయాడు. దీంతో, రవి పక్కనే ఉన్న తోటి కార్మికులు అతన్ని అడ్డుకున్నారు.
Telangana
tsrtc
warangal
narsampet
strike

More Telugu News