Telugudesam: టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దేవధర్ స్పందన

  • టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు
  • టీడీపీకి బీజేపీ ద్వారాలు మూసుకుపోయాయి
  • వైసీపీ, జనసేనతో కూడా పొత్తు ఉండదు
ప్రధాని మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని... కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీతో విభేదించామని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. బీజేపీ టీడీపీ మళ్లీ దగ్గరవుతోందా? అనే చర్చ భారీ ఎత్తున సాగుతోంది.

ఈ నేపథ్యంలో, ఈ అంశంపై ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దేవధర్ స్పందించారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. టీడీపీకి బీజేపీ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పారు. వైసీపీ, జనసేనతో కూడా బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి నివేదికను రూపొందించామని... ఆ నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు అందజేస్తామని తెలిపారు.
Telugudesam
YSRCP
Janasena
Chandrababu
Sunil Deodhar

More Telugu News