Narendra Modi: మోదీ అన్న కుమార్తె హ్యాండ్ బ్యాగ్ ను ఎత్తుకెళ్లింది వీరే

  • ఢిల్లీలో రెచ్చిపోయిన దొంగలు
  • ప్రధాని మోదీ సోదరుడి కుమార్తె హ్యాండ్ బ్యాగ్ చోరీ
  • సీసీటీవీలో రికార్డైన దొంగల చిత్రాలు
దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు రెచ్చి పోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్న ప్రహ్లాద్ మోదీ కుమార్తె దమయంతి బెన్ మోదీ హ్యాండ్ బ్యాగ్ నే అపహరించారు. వివరాల్లోకి వెళ్తే, ఓ పని మీద నిన్న ఉదయం ఆమె అమృత్ సర్ నుంచి ఢిల్లీకి వచ్చారు. బెన్ సివిల్ లైన్స్ లో ఉన్న గుజరాత్ సమాజ్ భవన్ లో ఓ గదిని బుక్ చేసుకున్నారు. గుజరాత్ సమాజ్ భవన్ గేటు వద్ద దిగి లోపలకు వెళ్తుండగా... ఓ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను లాక్కెళ్లారు. ఆ బ్యాగ్ లో రూ. 56 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని కీలక ప్రత్రాలు ఉన్నాయి. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

మరోవైపు, ఘటనాస్థలం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి నివాసానికి దగ్గర్లోనే ఉండటం గమనార్హం. చోరీకి పాల్పడ్డ దుండగుల చిత్రాలు సీసీటీవీ ఫుటేజీలో లభ్యమయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Narendra Modi
Damayanti Ben Modi

More Telugu News