Haryana: అశ్లీల సైట్ల కోసం భర్త స్నేహితుడితో కలిసి భార్య వీడియోలు.. చూసి షాకైన భర్త!

  • స్నేహితుడి భార్యపై కన్నేసిన ప్రబుద్ధుడు
  • డబ్బుపై మోజును గుర్తించి ముగ్గులోకి 
  • అశ్లీల వీడియోలు చేస్తూ వెబ్‌సైట్లలో అప్‌లోడ్

అశ్లీల సైట్ల కోసం భార్య చేసిన వీడియో చూసిన భర్త నివ్వెరపోయాడు. భార్యతో ఉన్నది తన స్నేహితుడేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాష్, నీలూ  (అసలు పేర్లు కావు) భార్యాభర్తలు. ప్రకాష్ స్నేహితుడైన సునీల్ తరచూ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో నీలూకు ఖరీదైన బహుమతులు ఇస్తూ ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో వారిమధ్య వివాహేతర బంధం ఏర్పడింది. నీలూకు డబ్బుపై ఉన్న వ్యామోహాన్ని గుర్తించిన సునీల్ తన ప్లాన్ అమలు చేశాడు. ఇద్దరం కలిసి అశ్లీల వీడియోల్లో నటిస్తే బోల్డంత డబ్బు వస్తుందని నమ్మబలికాడు. దీనికి ఆమె సరేననడంతో ఇద్దరూ కలిసి వీడియోలు చేసి అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టారు.

చాలా కాలంగా నిరాటంకంగా కొనసాగిన ఈ వ్యవహారం తాజాగా బయటపడింది. ప్రకాష్ ఇటీవల తన భార్య సెల్‌ఫోన్ ఓపెన్ చేసి అందులోని వీడియోలు చూసి విస్తుపోయాడు. తన స్నేహితుడితో ఆమె సన్నిహితంగా ఉన్న వీడియోలను చూసి షాకై భార్యను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. నమ్మిన స్నేహితుడే ద్రోహం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News