Devineni Uma: సెప్టిక్ ట్యాంకులకు కూడా వైసీపీ రంగులేసుకుంటున్నారు: దేవినేని ఉమ

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో జగన్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు గ్రామ వలంటీర్ల సాయంతో  కుట్ర చేస్తున్నారని ఉమ ఆరోపించారు. సెప్టిక్ ట్యాంకులకు కూడా వైసీపీ రంగులు వేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంతకుముందు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పైనా ఉమ స్పందించారు. కొల్లు రవీంద్ర దీక్షతో ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. ఆయనను అత్యుత్సాహంతో అరెస్టు చేశారని మండిపడ్డారు.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP

More Telugu News