Varun Tej: బాక్సింగ్ లో శిక్షణ కోసం ముంబైకి వరుణ్ తేజ్

  • 'గద్దలకొండ గణేశ్'తో హిట్ 
  • బాక్సింగ్ నేపథ్యంలో నెక్స్ట్ మూవీ 
  •  జనవరిలో సెట్స్ పైకి
'గద్దలకొండ గణేశ్' విజయాన్ని అందించడంతో వరుణ్ తేజ్ ఫుల్ జోష్ తో వున్నాడు. తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఆయన నెక్స్ట్ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. అందువలన ఆయన 2 నెలల పాటు బాక్సింగ్ లో శిక్షణ పొందడానికి ముంబై వెళుతున్నాడు. బాక్సింగ్ లో శిక్షణను పూర్తిచేసుకుని ఆయన డిసెంబర్లో తిరిగి హైదరాబాద్ రానున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ బాణీలను సమకూర్చుతున్నాడు.
Varun Tej

More Telugu News