Sania Mirza: జిమ్ లో సానియా మీర్జా కసరత్తులు... వీడియో ఇదిగో!

  • బిడ్డ పుట్టిన తర్వాత ఆటకు విరామం ఇచ్చిన సానియా
  • త్వరలోనే టెన్నిస్ లో పునరాగమనం
  • జిమ్ లో తీవ్రమైన కసరత్తులు
భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా టెన్నిస్ బరిలో పునరాగమనం చేస్తోంది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో కొనసాగిన సానియా అనేక టైటిళ్లు గెలిచి ర్యాంకింగ్ లో టాప్ కి చేరింది. అయితే, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆటకు విరామం ఇచ్చింది.

ప్రస్తుతం పూర్వపు ఆరోగ్యం పుంజుకున్న సానియా మరోసారి ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ బాట పట్టింది. గత కొన్నిరోజులుగా జిమ్ లో తీవ్రంగా శ్రమిస్తున్న సానియా కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఆటకు అనువుగా తన శరీరాన్ని మార్చుకుంటోంది. తన శరీరం ఇప్పుడిప్పుడే దృఢంగా మారుతోందని, పూర్వపు స్టామినా అందిపుచ్చుకుంటున్నానని సానియా ట్వీట్ చేసింది. అంతేకాదు, తాను జిమ్ లో చెమటోడ్చుతున్నప్పటి వీడియోను కూడా పోస్టు చేసింది.
Sania Mirza
Tennis
Pakistan
Shoaib Malilk

More Telugu News