Peddireddy: ఇసుక సరఫరాలో స్థానికులకే ప్రాధాన్యం... అధికారులకు స్పష్టం చేసిన మంత్రి పెద్దిరెడ్డి

  • కొత్త ఇసుక విధానంపై మంత్రి సమీక్ష
  • ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
  • రోజుకు లక్ష టన్నుల సరఫరా జరపాలని స్పష్టీకరణ
ఏపీలో కొత్త ఇసుక విధానం అమలు చేయాలని సర్కారు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరతలేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఇసుక సరఫరాలో మొదట స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులతో చెప్పారు. ఇసుక సరఫరా రోజుకు లక్ష టన్నులకు పెంచాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35 వేల టన్నులు సరఫరా అవుతోందని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 3 నెలలుగా ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
Peddireddy
Andhra Pradesh
Sand

More Telugu News