Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ తో అనుంబంధంపై మరోసారి స్పష్టతనిచ్చిన పునర్నవి భూపాలం

  • ప్రాచుర్యం అందుకున్న రాహుల్, పునర్నవి ఫ్రెండ్షిప్
  • సోషల్ మీడియాలో విపరీతమైన ఊహాగానాలు
  • కొట్టిపారేసిన పునర్నవి
బిగ్ బాస్-3 రియాల్టీ షోలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం కొన్ని వారాల్లోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అందుకు కారణం, వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యమే. వారి అనుబంధం స్నేహాన్ని దాటి మరింత ముందుకెళ్లిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అటు రాహుల్ కానీ, ఇటు పునర్నవి కానీ తమ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ నడుస్తున్నది చెప్పకపోవడంతో ఊహాగానాలు మరింత జోరుగా సాగాయి.

అయితే, పునర్నవి ఎలిమినేట్ అయిన తర్వాత అనేక మీడియా సంస్థలకు ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా రాహుల్ తో రిలేషన్ గురించి ఓ ప్రశ్న తప్పకుండా ఎదురయ్యేది. ఈ నేపథ్యంలో, రాహుల్ తో తన ఫ్రెండ్షిప్ గురించి మరింత స్పష్టతనిచ్చింది. తామిద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉందని, అది ప్రేమంటూ చాలామంది పొరబడ్డారని వివరణ ఇచ్చింది.

మొదట్లో ఈ సాన్నిహిత్యం అందరిలో అపోహలు కలిగిస్తుందని, అతడ్ని దూరంగా పెట్టేదాన్నని, అయినప్పటికీ అందరూ తమ గురించి మరోలా మాట్లాడుకోవడం బాధ కలిగించిందని పునర్నవి వాపోయింది. అప్పటినుంచి ఎవరేమనుకున్నా రాహుల్ తో ఫ్రెండ్లీగా ఉండడానికే ప్రాధాన్యత ఇచ్చానని స్పష్టం చేసింది. షో మొదట్లో తాము ఎక్కువగా గొడవ పడకుండా ఉండేవాళ్లమని,  అది చూసి తమ మధ్య ప్రేమ ఉందని అందరూ పొరబడ్డారని పునర్నవి వివరించింది.
Rahul Sipligunj
Punarnavi Bhupalam
BiggBoss-3
Andhra Pradesh
Telangana

More Telugu News