Chiranjeevi: నిశ్చితార్థ వేడుకలో కలిసిన చిరంజీవి, బాలకృష్ణ... పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు!

  • వైభవంగా సాగిన కోడి రామకృష్ణ రెండో కుమార్తె వివాహం
  • ప్రవల్లిక, మహేశ్ ల ఎంగేజ్ మెంట్ కు తరలివచ్చిన తారాలోకం
  • కాబోయే వధూవరులకు అభినందనలు
టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి, బాలకృష్ణలు మరోసారి కలిశారు. ప్రముఖ సినీ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహ నిశ్చితార్థం సీహెచ్ మహేశ్ తో వైభవంగా సాగగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, బాలయ్యలు పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ నటుడు మురళీ మోహన్ లతో పాటు పరుచూరి గోపాలకృష్ణ, రాఘవేంద్రరావు, రాజశేఖర్, జీవిత దంపతులు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు కాబోయే వధూవరులకు శుభాభినందనలు తెలిపారు. 
Chiranjeevi
Balakrishna
Venkaiah Naidu
Kodi Ramakrishna
Engagement
Pravallika

More Telugu News