intercity express: నవంబర్‌ 3 నుంచే ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ కొత్త వేళలు

షార్ట్స్‌లో చూడండి
విజయవాడ-లింగంపల్లి-విజయవాడ మధ్య తిరిగే ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ టైంటేబుల్‌ను దక్షిణ మధ్య రైల్వేశాఖ ముందుకు జరిపింది. జనవరి నుంచి కొత్త టైమింగ్స్‌ అమల్లోకి తెస్తామని గతంలో ప్రకటించిన రైల్వేశాఖ తాజాగా నవంబరు 3 నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్ల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్‌ తెలిపారు.

కొత్త టైం టేబుల్‌ ప్రకారం12796 లింగంపల్లి - విజయవాడ రైలు  గుంటూరుకు ఉదయం 9.20కే చేరుకుని 9.22కి బయలుదేరుతుంది. మంగళగిరికి 9.42కి చేరుకుని 9.43కి బయలుదేరుతుంది. విజయవాడకు ఉదయం 10.30కి చేరుతుంది. నంబరు 12795 విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌కి రాత్రి 10.20కి చేరుకుని 10.25కి బయలుదేరుతుంది. బేగంపేటకు రాత్రి 10.34కి చేరుకుని 10.35కి బయలుదేరి లింగంపల్లికి రాత్రి 11.15కి చేరుకుంటుంది.
Go Back to Shorts
intercity express
timetable
Vijayawada
lingampalli

More Telugu News