Hyderabad: హైదరాబాద్ ఎంజే మార్కెట్ లో అగ్ని ప్రమాదం!

  • తెల్లవారుజామున అగ్ని ప్రమాదం
  • పీవీసీ పైపుల గోడౌన్ లో మంటలు
  • అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక శాఖ 
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాంపల్లిలోని యం.జే మార్కెట్‌ వద్ద ఈ తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పీవీసీ పైపులను నిల్వ ఉంచిన బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
Hyderabad
Fire Accident
MJ Market

More Telugu News