Andhra Pradesh: సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన రద్దు!

  • అమిత్ షాను కలిసేందుకు దొరకని అపాయింట్ మెంట్
  • మహారాష్ట్ర ఎన్నికల  ప్రచారంలో హోంమంత్రి బిజీ  
  • అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకకపోవడం ఇది రెండోసారి
ఏపీ సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ లభించలేదని సమాచారం. దీంతో, జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, జగన్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకకపోవడం వరుసగా ఇది రెండోసారి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉన్నందున అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం.
Andhra Pradesh
cm
jagan
Amit Shah
Minister

More Telugu News