China: అరచవిట్ట సాంబారు, కవణరాశి హల్వా... చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మెనూలో తమిళ వంటకాలు!

  • భారత్ లో అడుగుపెట్టిన చైనా దేశాధ్యక్షుడు
  • మహాబలిపురంలో చర్చలు
  • జిన్ పింగ్ కోసం ప్రత్యేక మెనూ
చైనా దేశాధినేత జిన్ పింగ్ భారత పర్యటన కోసం తమిళనాడులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో భారత ప్రధాని మోదీ, జిన్ పింగ్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ విచ్చేసిన విశిష్ట అతిథి కోసం ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ లో జిన్ పింగ్ ను అచ్చెరువొందించేలా ప్రత్యేక వంటకాలతో మెనూ రూపొందించారు. ఈ మెనూలో ఎంతో పేరుగాంచిన తమిళ వంటకాలకు స్థానం కల్పించారు. కవణరాశి హల్వా, అరచవిట్ట సాంబారు, తక్కాల్ రసమ్ (టమోటా చారు), కడలాయ్ కుర్మా తదితర వంటకాలను జిన్ పింగ్ కు వడ్డించనున్నారు. చెట్టినాడ్ వంటకాల నుంచి కారైక్కుడి ఆహార పదార్థాల వరకు జిన్ పింగ్ విందు భోజనంలో కొలువుదీరనున్నాయి.
China
Xi Jinping
Tami
Food

More Telugu News