Narendra Modi: సుస్వాగతం ప్రెసిడెంట్ జిన్ పింగ్: మోదీ ట్వీట్

  • చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు
  • అంతకు ముందే చెన్నైలో అడుగుపెట్టిన మోదీ
  • తమిళనాడు గడ్డపై ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్న ప్రధాని
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రెండు రోజుల పర్యటనకు గాను భారత్ విచ్చేశారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్, సీఎం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ కు చేరుకున్నారు. జిన్ పింగ్ రాక సందర్భంగా ఆయనకు ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ స్వాగతం పలికారు. 'వెల్ కం టు ఇండియా, ప్రెసిడెంట్ జిన్ పింగ్' అని ట్వీట్ చేశారు.

మరోవైపు, జిన్ పింగ్ చెన్నైకు చేరుకోక ముందే మోదీ అక్కడకు చేరుకున్నారు. ఆయనకు తమిళనాడు గవర్నర్, సీఎంలు స్వాగతం పలికారు. చెన్నై చేరుకున్న తర్వాత ట్విట్టర్ ద్వారా మోదీ స్పందిస్తూ, 'గొప్ప సంస్కృతి, ఆతిథ్యానికి మారుపేరైన అత్యున్నతమైన తమిళనాడు గడ్డపై ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. చైనా అధ్యక్షుడికి తమిళనాడు ఆతిథ్యమిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ అనధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నా' అని ట్వీట్ చేశారు.
.
Narendra Modi
Jinping
India
China
Chennai

More Telugu News