Chandrababu: బాలీవుడ్ షెహెన్షాకు జన్మదిన శుభాకాంక్షలు: చంద్రబాబు

  • నేడు అమితాబ్ పుట్టినరోజు
  • ట్విట్టర్ లో విషెస్ తెలిపిన చంద్రబాబు
  • మరిన్ని సంవత్సరాలు ఇలాగే అలరించాలని ట్వీట్
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని సంవత్సరాలు ఇలాగే అందరినీ అలరించాలని ఆకాంక్షిస్తున్నాం, హ్యాపీ బర్త్ డే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అమితాబ్ ఇవాళ తన 77వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 1942 అక్టోబరు 11న ప్రయాగ్ రాజ్ లో జన్మించారు.
Chandrababu
Amitabh Bachchan
Bollywood
Telugudesam

More Telugu News