Tirumala: తిరుమల వెంకన్నను దర్శించుకున్న సుప్రీం న్యాయమూర్తులు

  • శ్రీవారి సన్నిధిలో జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
  • నిన్న సాయంత్రం కొండపైకి
  • ఈరోజు ఉదయం స్వామి సేవలో...
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ బోపన్న కుటుంబ సభ్యులు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి గురువారం సాయంత్రం కొండపైకి చేరుకున్న న్యాయమూర్తులు ఈరోజు ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Tirumala
supreme judges
venkatewara temple
NVRAMANA
BOPANNA

More Telugu News