Uttar Pradesh: భక్తులపైకి దూసుకొచ్చిన బస్సు... ఏడుగురి మృతి!

  • శుక్రవారం తెల్లవారుజామున ఘటన
  • పుణ్యస్నానాల కోసం వచ్చి నిద్రిస్తున్న యాత్రికులు
  • ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారుల మృతి
నదిలో పుణ్య స్నానాలు ఆచరించాలని వారంతా వచ్చారు. సూర్యోదయం సమయంలో స్నానాలు చేయాలని భావించి, రాత్రి సమయంలో అక్కడే నిద్రించారు. కానీ, అంతలోనే మృత్యువు దూసుకొచ్చింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన యూపీలోని బులంద్ షహర్ సమీపంలో గంగా నది ఒడ్డున నౌరౌరా ఘాట్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగింది.

నదిలో స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు తీరంలోని రోడ్డుపక్కగా నిద్రిస్తుండగా, వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో వస్తున్న బస్సు అదుపుతప్పి వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. ఘటనలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మరణించారు. ప్రమాదం అనంతరం బస్సును వదిలేసి డ్రైవర్ పారిపోగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
Uttar Pradesh
Road Accident
Died
Buland Shahar

More Telugu News