Goddeti madhavi: అరకు ఎంపీ మాధవి ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్..వైరల్‌గా మారిన ఫొటోలు

  • ఈ నెల 17న మాధవి-శివప్రసాద్ వివాహం
  • రుషికొండ వద్ద రిసార్ట్‌లో విందు
  • దేముడి వారసురాలిగా రాజకీయాల్లోకి మాధవి
విశాఖపట్టణం జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్‌ను ఈ నెల 17న మాధవి పెళ్లాడనున్నారు. గోలుగొండ మండలంలోని కేడీపేటకు చెందిన శివప్రసాద్ బీటెక్, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం ఓ కాలేజీలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో వైభవంగా వివాహం జరగనుండగా, విశాఖపట్టణంలోని రుషికొండ వద్ద ఉన్న ఓ రిసార్ట్‌లో రిసెప్షన్ జరగనుంది.

ఇక, పెళ్లి సమయం దగ్గరపడుతుండడంతో మాధవి-శివప్రసాద్‌లు ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్‌ చేయించుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఉపాధ్యాయురాలిగా పనిచేసిన మాధవి గత ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. మాధవి తండ్రి గొడ్డేటి దేముడు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.  కమ్యూనిస్టు నేతగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దేముడు వారసురాలిగా మాధవి వైసీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.


Goddeti madhavi
araku
YSRCP
wedding

More Telugu News