మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ కన్నుమూత
- అనారోగ్యంతో కేఆర్ ఆమోస్ మృతి
- సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
- ఆమోస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన టీఆర్ఎస్ నేతలు
1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై నడిపించిన వ్యక్తి ఆమోస్ అని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాటు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై నాలుగు దశాబ్దాల పాటు ఆమోస్ పోరాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారని అన్నారు. కాగా, ఆమోస్ రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు.