మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ కన్నుమూత

షార్ట్స్‌లో చూడండి
అనారోగ్యం కారణంగా మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ కన్నుమూశారు. మల్కాజ్ గిరిలోని  నివాసంలో ఆయన మృతి చెందారు. ఆమోస్ మృతిపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఆమోస్ మృతి తెలంగాణకు తీరని లోటని టీఆర్ఎస్ నేతలు అన్నారు. ఆమోస్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై నడిపించిన వ్యక్తి ఆమోస్ అని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో పాటు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై నాలుగు దశాబ్దాల పాటు ఆమోస్ పోరాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారని అన్నారు. కాగా, ఆమోస్ రెండు సార్లు  ఎమ్మెల్సీగా పని చేశారు.
Go Back to Shorts
Ex-mlc
Aamos
Demise
cm
kcr
KTR
TRS

More Telugu News