TG Venkatesh: మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నా లక్ష్యం: టీజీ వెంకటేశ్

  • కర్నూలులో సమావేశమైన రాయలసీమ జిల్లాల బీజేపీ నేతలు
  • సంకల్ప యాత్ర నిర్వహించాలని నిర్ణయం
  • ప్రతి ఒక్కరూ గాంధీ సిద్ధాంతాలను ఆచరించాలన్న టీజీ
జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన సిద్ధాంతాలను ఆచరించడమే తన లక్ష్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ చెప్పారు. గాంధీ సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని చెప్పారు. కర్నూలులో ఈరోజు రాయలసీమ జిల్లాల బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ నెల 15 నుంచి సంకల్ప యాత్ర నిర్వహించాలని ఈ సందర్భంగా బీజేపీ నేతలు నిర్ణయించారు.

ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ, స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు తాము చేపట్టబోతున్న యాత్ర ఉపయోగపడుతుందని చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించడం, అట్టడుగున ఉన్న సామాజికవర్గాలను పైకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
TG Venkatesh
BJP
Gandhi

More Telugu News