Ravi Prakash: రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు

  • చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న రవిప్రకాశ్
  • విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు
  • రేపు తీర్పును వెలువరించనున్న కోర్టు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కస్టడీపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రవిప్రకాశ్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రూ. 18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్ పై టీవీ9 యాజమాన్యం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది. కేసును విచారించిన కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించింది. అయితే, కేసుకు సంబంధించి రవిప్రకాశ్ ను విచారించాల్సి ఉందని, ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ బంజారా హిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్డు ఈరోజు వాదనలను వింది. రేపు దీనిపై తీర్పును వెలువరించనుంది.
Ravi Prakash
TV9
Remand

More Telugu News