Sairaa: 20 ఏళ్లలో నేను చూసిన రెండో సినిమా 'సైరా': తెలంగాణ గవర్నర్ తమిళిసై

  • సినిమా చూడాలని తమిళిసైని ఆహ్వానించిన చిరంజీవి
  • సినిమాలో చిరంజీవి చక్కగా నటించారని కితాబు
  • 'కాలా' తరువాత తాను చూసిన చిత్రం ఇదేనన్న తమిళిసై
గడచిన 20 సంవత్సరాల్లో తాను చూసిన రెండో చిత్రం చిరంజీవి నటించిన 'సైరా' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. మెగాస్టార్ కోరిక మేరకు సినిమాను చూసిన ఆమె, ఆపై మీడియాతో మాట్లాడారు. చిత్రంలో చిరంజీవి అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. 1999 తరువాత తాను 2018లో రజనీకాంత్ నటించిన 'కాలా' చూశానని, ఆపై తాను చూసిన రెండో చిత్రం ఇదేనని ఆమె అన్నారు.

తమిళిసై కోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబీకులు కూడా సినిమా చూశారు. కాగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'సైరా' విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
Sairaa
Tamili Sai
Kalaa
Chiranjeevi

More Telugu News