Telangana: తెలంగాణలో దసరా సెలవుల పొడిగింపు!

  • కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
  • సెలవులను రెండు రోజులు పొడిగించాలని నిర్ణయం
  • నేడు వెలువడనున్న ఉత్తర్వులు
టీఎస్ ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో దసరా సెలవులను పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బస్సులు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, వివిధ పట్టణాలతో పాటు హైదరాబాద్ లో స్కూల్ బస్సులను లోకల్ సర్వీసులుగా తిప్పుతూ ఉండటంతో కనీసం రెండు రోజుల పాటు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయని ఓ అధికారి వెల్లడించారు. వాస్తవానికి ఈ నెల 13 వరకూ దసరా సెలవులున్నాయి. ఈలోగా సమ్మె పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపించక పోవడం, కొత్త ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో 15 వరకూ సెలవులను పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Telangana
Dasara
Holidays
Extenssion

More Telugu News