Reliance: జియో కీలక నిర్ణయం.. ఇకపై ఇతర నెట్ వర్క్ కి కాల్ చేస్తే ఛార్జీలు!

షార్ట్స్‌లో చూడండి
టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జియో నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ నంబర్లకు ఫోన్ చేస్తే ప్రతి నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్టు జియో సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి  బదులుగా తగిన డేటాను తిరిగి అందిస్తామని ఈ మేరకు జియో ఓ ప్రకటన చేసింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీ (ఐయూసీ)ల విషయంలో టెలికాం రెగ్యులేటరి అథారిటీ (ట్రాయ్) నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

జియో సొంత నెట్ వర్క్ కాల్స్ కు  మాత్రం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. అలాగే, ఇన్ కమింగ్ కాల్స్, ల్యాండ్ లైన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ కు ఈ ఛార్జీలు వర్తించవని వివరించింది.

 ఈ సందర్భంగా ఐయూసీ టాప్ అప్ వోచర్లను జియో ప్రవేశపెట్టింది. దీని వల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని తెలిపింది. ట్రాయ్ జీరో టర్మినేషన్ చార్జిని తొలగించే వరకూ ఈ టాప్ అప్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధన వచ్చే ఏడాది జనవరి 1 వరకూ అమల్లో ఉండనుంది.
Go Back to Shorts
Reliance
jio
Troi
IUC
Airtel
Idea

More Telugu News