nellore: నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబునాయుడు

  • నెల్లూరు జిల్లా కార్యకర్తలతో బాబు భేటీ
  • వైసీపీ ప్రభుత్వం తప్పుడు పనులను ఎండగడతా
  • జగన్ పులివెందుల పంచాయితీ చేస్తున్నారు
నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమరావతిలో నెల్లూరు జిల్లా కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే తప్పుడు పనులను ప్రజల్లో ఎండగడతానని అన్నారు. నెల్లూరు నేతలను పిలిచి పులివెందుల పంచాయితీ చేస్తున్నారని జగన్ పై బాబు మండిపడ్డారు. కోటంరెడ్డికి వెంటనే బెయిల్ ఇచ్చి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? అని ప్రశ్నించారు.
nellore
YSRCP
cm
Jagan
Chandrababu

More Telugu News