కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలకు ఫైల్ సిద్ధం చేయండి: కేసీఆర్ ఆదేశాలు

షార్ట్స్‌లో చూడండి
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, రెండు రోజుల్లో ఈ నియామకాలపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఫైల్ ను సిద్ధం చేయనున్నారు. అనంతరం కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విధులకు హాజరుకాని ఆర్టీసీ ఉద్యోగులంతా వారంతట వారే సెల్ఫ్ బర్తరఫ్ అయినట్టేనని కేసీఆర్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. సమ్మెతో ప్రభుత్వాన్ని బెదిరించలేరని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
KCR
TRS
RTC Strike

More Telugu News