ఆకర్షించే ఫీచర్లతో రెడ్ మీ 8... 4 జీబీ/64 జీబీ రూ. 8,999 మాత్రమే!

షార్ట్స్‌లో చూడండి
చైనాకు చెందిన రెడ్ మీ మరో సరికొత్త బడ్జెట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్ మీ 7 వర్షన్ కు అప్ డేట్ గా 8 వర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. 3 జీబీ ర్యామ్ / 32 జీబీ స్టోరేజ్ ఫోన్ ధరను రూ. 7,999గా, 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ ధరను రూ. 8,999గా సంస్థ నిర్ణయించింది.

ఈ ఫోన్ లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వాటర్ డ్రాప్ తరహా నాచ్ డిజైన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లున్నాయి. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే, స్నాప్‌ డ్రాగన్‌ 439 ప్రాసెసర్, ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9, 720 / 1520 పిక్సెల్స్‌ రెజల్యూషన్‌, 4 జీబీ  ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 12 / 2  ఎంపీ డ్యూయల్‌ కెమెరాలు వెనుకవైపు, 8 ఎంపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెల్పీ కెమెరాలున్నాయి.
Go Back to Shorts
Red Mi
8 Version
New Smart Phone

More Telugu News