Andhra Pradesh: ఇరు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన!

  • పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన కేంద్ర వాతావరణశాఖ
  • కొన్ని రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య మహారాష్ట్ర, యానాం, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అసోం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తాజా బులెటిన్ లో తెలిపింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Andhra Pradesh
Telangana
Rain Forecast

More Telugu News