మరింత ఉద్ధృతమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. ఐదో రోజూ డిపోలకే పరిమితమైన బస్సులు
- వెనక్కి తగ్గేది లేదన్న ఆర్టీసీ కార్మికులు
- ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన నేడు అఖిలపక్ష సమావేశం
- హాజరుకానున్న విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు
ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌పై నేడు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం, భవిష్యత్ పోరాటంపై చర్చించనున్నారు. మరోవైపు, ఐదో రోజు కూడా బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందితో పాక్షికంగా బస్సులు నడుపుతోంది.