Andhra Pradesh: నేరుగా ఇంట్లోకి వచ్చిన కొండచిలువ.. భయంతో వణికిపోయిన కుటుంబ సభ్యులు

  • ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ఘటన
  • అటవీశాఖ అధికారులకు సమాచారం
  • బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన అధికారులు
ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, సరాసరి ఇంట్లోకి వచ్చి తిష్టవేసిన కొండచిలువను చూసిన ఆ కుటుంబం భయంతో వణికిపోయింది. దాని నుంచి తప్పించుకుని బయటకు వచ్చి స్థానికుల సాయంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారొచ్చి దానిని బంధించి తీసుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దిగువమెట్టతండాలో జరిగిందీ ఘటన. కొండచిలువను బంధించిన అధికారులు దానిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
Andhra Pradesh
Prakasam District
python

More Telugu News