Jagan: జగన్ ఓ సైకో కాబట్టే వైఎస్ దూరంగా ఉంచారని జూపూడి అనలేదా?: టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి

  • వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావు
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత
  • పదవి కోసమేనంటూ ఆరోపణ
టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావుపై ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు. తాను దళిత పులిని అని అభివర్ణించుకున్న జూపూడి ఇవాళ దళితులను మోసం చేస్తూ వైసీపీలో చేరారని మండిపడ్డారు. జూపూడి అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తి అని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండడం జూపూడికి అలవాటని విమర్శించారు.

గతంలో జగన్ ను కాలకేయుడు అని, విషపూరితమైన వ్యక్తి అని వ్యాఖ్యానించింది జూపూడి కాదా? అని ప్రశ్నించారు. జగన్ ఓ సైకో కాబట్టే వైఎస్ ఆయనను దూరంగా ఉంచారని జూపూడి వ్యాఖ్యానించింది నిజం కాదా? అని నిలదీశారు. ఇవాళ జగన్ ను జూపూడి పొగడడం వెనుక పదవీకాంక్ష ఉందని ఆరోపించారు. రంగులు మార్చడంలో ఊసరవెల్లితో పోటీపడుతున్నాడని జూపూడిపై విమర్శలు చేశారు.
Jagan
Jupudi Prabhakar
Dola Balaveeranjaneyaswami
Telugudesam
YSRCP

More Telugu News