Seenaiah: వీవీ వినాయక్ హీరోగా వస్తున్న చిత్రం టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ ఇదిగో!

  • 'సీనయ్య'గా వస్తున్న వినాయక్
  • దసరా కానుకగా ఫస్ట్ లుక్ విడుదల
  • మాస్ లుక్ తో దర్శనమిచ్చిన వినాయక్
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'సీనయ్య' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ దసరా సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. సరికొత్త మేకోవర్ లో వీవీ వినాయక్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇటీవలే వీవీ వినాయక్ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ బయటికి వచ్చినా, సినిమాలో స్టిల్ ఇవాళే విడుదలైంది.  వినాయక్ చేతిలో బరువైన రెంచీతో మాస్ లుక్ తో దర్శనమిస్తున్నాడు. ఈ సినిమాకు ఎన్.నరసింహ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం, మణిశర్మ సంగీతం అందించనున్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది.
Seenaiah
VV Vinayak
Tollywood
Dil Raju

More Telugu News