Chandrababu: చంద్రబాబుకు, మీకు తేడా ఏంటి జగన్..?: కన్నా సూటి ప్రశ్న

  • కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్లు వేసుకున్నాడని ఆరోపణ
  • పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చేశారంటూ జగన్ పై ధ్వజం
  • ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు కేంద్ర పథకాలకు తమ స్టిక్కర్ వేసుకున్నాడని, ఇప్పుడు మీరు అంతకుమించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులు వేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మీకు ఓటేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu
Jagan
Kanna Lakshninarayana
Andhra Pradesh
BJP
YSRCP
Telugudesam

More Telugu News