Komatireddy: 50 వేలమంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోతే మేం ఉండి కూడా ఏం లాభం?: కోమటిరెడ్డి

  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె
  • ఉద్యోగులపై కఠినచర్యలకు సర్కారు సన్నాహాలు
  • స్పందించిన కోమటిరెడ్డి
తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై టీఆర్ఎస్ సర్కారు కఠినచర్యలు తీసుకుంటోన్న నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. 50 వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోతే మేం ఉండి కూడా ఏం లాభం? అని అన్నారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో తిరుగుతానని చెప్పారు.

అధికార పార్టీలో ఉంటేనే హుజూర్ నగర్ ను అభివృద్ధి చేస్తారా? అంటూ నిలదీశారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీపీఐ పొత్తు కోరారంటే టీఆర్ఎస్ ఓటమిని అంగీకరించినట్టేనని వ్యాఖ్యానించారు.
Komatireddy
Telangana
TRS
Congress
TSRTC

More Telugu News