Diamond: ప్రపంచంలో తొలిసారి... వజ్రం గర్భంలో మరో వజ్రం!

షార్ట్స్‌లో చూడండి
మరో వజ్రాన్ని తన గర్భంలో దాచుకున్న వజ్రం తొలిసారిగా మానవుని కంటపడింది. రష్యా ప్రభుత్వ వజ్రాల వెలికితీత సంస్థ అల్ రోసా పీజేఎస్సీ నిర్వహిస్తున్న గనుల్లో ఇది దొరికింది. వజ్రం గర్భంలో మరో వజ్రం అటూ ఇటూ స్వేచ్ఛగా కదులుతూ ఉండటం గమనార్హం. ఈ వజ్రం దాదాపు 800 మిలియన్ సంవత్సరాల నాటిది అయివుండవచ్చని అల్ రోసా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తరహా వజ్రం కనిపించడం ఇదే తొలిసారని, దీన్ని 'మట్రోష్కా డైమండ్'గా వ్యవహరిస్తారని తెలిపింది. ఈ వజ్రం 0.62 క్యారెట్లుండగా, లోపలున్న వజ్రం 0.02 క్యారెట్లుందని వెల్లడించింది. ప్రకృతి ఎన్నో రహస్యాలను దాచుకుని ఉందని, వాటిల్లో మానవాళికి తెలియనివే అత్యధికమని చెప్పడానికి ఇదో ఉదాహరణని అభిప్రాయపడింది.
Go Back to Shorts
Diamond
Russia
Alrosa

More Telugu News