Venky Mama: 'గోదావరిలో ఈత నేర్పా... ఇప్పుడు వేట నేర్పిస్తా... రారా అల్లుడు'... 'వెంకీమామ' దసరా కానుక!

  • వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా వెంకీమామ
  • టీజర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • అలరిస్తున్న వెంకటేశ్ డైలాగులు
సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా సంయుక్తంగా నిర్మిస్తున్న 'వెంకీమామ' టీజర్ దసరా సందర్భంగా ఈ ఉదయం విడుదలైంది. "గోదావరిలో ఈత నేర్పా... బరిలో ఆట నేర్పా... ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా. రారా అల్లుడు" అంటూ వెంకటేశ్ తనదైన శైలిలో డైలాగ్ చెప్పడం అలరించింది. ఆపై "ఏమంటుందిరా..? ఇందాకటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే... ఐలవ్ యూ అనేసిందిరా అల్లుడూ" అన్న మరో వెంకటేశ్ డైలాగ్ కూడా ఇందులో వినిపిస్తుంది. మామా, అల్లుళ్లు బైక్ పై రావడం, జాతరలో ఫైట్ సీన్ ను కూడా కొన్ని సెకన్ల పాటు చూపించారు. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.
Venky Mama
Teaser
Dasara

More Telugu News